Wednesday, July 16, 2014

Rabhasa's audio to be launched on July 27Rabhasa's audio to be launched on July 27
The principal shooting of NTR Jr's upcoming film, Rabhasa is fast nearing completion. Currently, a song is being filmed on the lead pair in Switzerland and with this, almost the entire film's shooting will be wrapped up. The latest news is that the audio will be launched in a grand manner in Shilpa Kala Vedika on July 27 in Hyderabad. Santosh Srinivas has directed the film and Bellamkonda Srinivas has produced it. Samantha and Pranitha Subhash are the lead actresses in this mass entertainer. Thaman has scored the music and recently, Thaman revealed that NTR Jr himself has sung a song, Rakshasi Rakshasi in the film. More details about the film are expected to be revealed soon.

Thursday, July 10, 2014

నేనడిగింది లేదంటావా... శ్రుతి హాసన్ మూడ్ అవుట్... కేకలు

ఒక్కో సంఘటన చూస్తుంటే సామెతల్లో ఎంత సత్యం ఉందో అర్థం అవుతుంది. ఇందుకు నటి శ్రుతిహాసన్ ప్రవర్తన తాజా ఉదాహరణ. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్. అలాంటి సెలబ్రిటీ స్టార్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోనూ, సంచలన సంఘటనలతోనూ వార్తల్లోకెక్కడం పరిపాటిగా మారిందనే ప్రచారాన్ని కొట్టివేయలేం. ఆ మధ్య హిందీ చిత్రం డీ డేలో మితిమీరిన శృంగారాన్ని ఒలకబోసి సినీ విమర్శకుల నోళ్లకు పని చెప్పారు. మరోసారి ఓ ఆగంతకుడు హద్దులు మీరిన అభిమానం చూపించడంతో శ్రుతిహాసన్ కలకలం సృష్టించారు.
Shruti hassan
ఇటీవల ఒక  తెలుగు నిర్మాత తన అనుమతి లేకుండా తన గ్లామరస్ ఫొటోలను నెట్‌లో ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ప్రచారం పొందారు. తాజాగా ఒక సేల్స్‌మన్‌తో లడాయికి దిగి తన అహం వెళ్లగక్కిన సంఘటన విస్మయానికి గురి చేసింది. అదేంటో చూద్దామా! 
శ్రుతిహాసన్ ఇటీవల చెన్నైలో ఒక షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. తన మేకప్‌లకు చెందిన కొన్ని వస్తువులు కావాలని అడిగారు. సేల్స్‌మన్ మేకప్ సామగ్రి లేదని బదులిచ్చాడు. ఆగ్రహించిన శ్రుతి ఆ సేల్స్‌మన్‌ను నోటికొచ్చినట్లు తిట్టేశారు.
రెగ్యులర్ కస్టమర్ షాప్‌నకు వచ్చి ఒక వస్తువు కావాలని అడిగితే అది ఉందో? లేదో కూడా చూడకుండా గుడ్డిగా లేదంటావా, నీ వల్ల కాకపోతే వేరే సేల్స్‌మన్‌తో చెప్పి తీసుకురమ్మని చెప్పవచ్చుగా అంటూ చెడామడా తిట్టేశారు. షాక్‌కు గురైన సేల్స్‌మన్ కొంతసేపటికి తేరుకుని ఏమి చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. విషయమేమిటంటే శ్రుతిహాసన్ అడిగిన మేకప్ సామగ్రి నిజంగానే ఆ షాపులో లేవట. మూడ్ అవుట్‌లో ఉండటం వలనే శ్రుతి అలా ప్రవర్తించారని తెలిసింది.

హంస చిందేస్తే సినిమా సూపర్‌హిట్టే

 
హంసానందిని.. పేరుకు తగ్గట్టు అందమైన రూపం, అదిరిపోయే డ్యాన్సు. దానికి తోడు ఆమె ఒక్క సాంగ్ లో కనిపించిన చిత్రాలన్నీ హిట్టు.  ప్రభాస్ ‘మిర్చి'  చిత్రం‌లో టైటిల్ సాంగ్ లో హాట్ మిర్చీగా కనిపించిన హంసానందిని ఆ తర్వాత అత్తారింటికి దారేది, లెజెండ్, సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
 
తెలుగు సినిమాల్లో సెంటిమెంటుకు ఎంత ప్రాధాన్యత వుంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే సెంటిమెంటు అంతటా చర్చగా మారింది. ఈ లక్కీ గర్ల్ ఐటం సాంగ్ లలో కనిపిస్తే ప్రేక్షకలు అదరహో అంటూ వుండటము, వరుసగా చిత్రాలన్నీ విజయాలు సాధించడంతో ఈ భామకు గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రంలో కూడా అవకాశం ఇచ్చారట.  ముమాయత్ ఖాన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించటం మానేసిన తర్వాత తెలుగు సినిమాల్లో ఐటం గర్ల్ స్థానాన్ని హంసానందిని భర్తి చెయ్యగలదని అనుకోవచ్చు. రియల్ స్టార్ శ్రీహరి ఆఖరి చిత్రం ‘రియల్ స్టార్’ లోనూ హంసా తన స్టెప్పులతో అదరగొట్టిందట.

Thursday, June 26, 2014

అప్సెట్ అయిన నమిత అభిమానులుతమిళనాట అభిమానులు గుడి కట్టి మరీ ఆరాధించే హీరోయిన్లలో ఒకరు నమిత. నమిత అభిమానుల గురించిన వార్తలు అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి. సినిమాలలో నమిత ఇప్పుడు ఎక్కువగా కనిపించకపోయినా అడపాదడపా తమిళనాడులో పబ్లిక్ అప్పియరెన్సులు మాత్రం ఇస్తోంది. ఈ మధ్య అలా ఆమె వెళ్లిన ఒక నాటక కార్యక్రమంలో అభిమానుల హడావిడి ఎక్కువై స్టేజి కూలిపోయింది. ప్రమాదంలో నమితకు ఏం కాకపోయినా మూడు అంబులెన్సులు మాత్రం ఆమె సహాయార్ధం వచ్చి నిలిచాయి.
 ఇదలా వుంచితే తాజాగా తమిళనాడు నామక్కల్‌లో నమితతో ఆటపాట  మీలో ఎవరు లారెన్స్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నమిత అనే సరికి వేలాదిగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం మొదలైనా, 10 గంటలవరకు నమిత జాడలేదు. చివరకు హెల్త్ అప్సెట్ అయి ఆమె రాలేకపోతోందని అనౌన్స్ చేశారు నిర్వాహకులు. దీంతో అభిమానులు కూడా బాగా అప్సెట్ అయి నానా రభస చేశారట. అంతే కాదు ఇది పచ్చి మోసం అంటూ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారట కార్యక్రమానికి వచ్చినవారు.

Saturday, June 14, 2014

హీరో లకు ఈ జబ్బులేంటి

హైదరాబాద్ : వైవిధ్యమున్న పాత్రలు అంటే హీరోలకు ఏదో ఒక మానసిక జబ్బు ఉండి, వాటితో ఇబ్బందిపడటమేనా...పరిస్ధితి చూస్తుంటే దర్శకులు,హీరోలు అదే నమ్ముతున్నట్లు ఉంది. సూర్య చిత్రం గజనీ ఏ ముహుర్తాన వచ్చి, హిట్టైందో కాని అప్పటి నుంచి ప్రతీ హీరో తను మానసిక జబ్బు ఉన్న పాత్రల్లో కనపించాలని కోరుకుంటున్నారు. తాజాగా వరస ఫ్లాపులతో ఉన్న విశాల్ తన తాజా చిత్రంలో ఓ సైకలాజికల్ సమస్యతో భాధపడే వ్యక్తిగా కనిపించనున్నారు. విశాల్ హీరోగా నటించిన సినిమా 'ఇంద్రుడు'. తమిళంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'నాన్ సిగప్పు మనిదన్'కు అనువాదమిది. ఊహించని ఘటనలు కళ్ల ముందు జరిగితే ఠక్కున నిద్రలోకి జారుకునే వ్యక్తికి సంబంధించిన కథతో తెరకెక్కింది. విశాల్, లక్ష్మీమీనన్ జంటగా నటించారు. తిరు దర్శకత్వం వహించారు.హీరో లకు ఈ జబ్బులేంటి
హీరో లకు ఈ జబ్బులేంటి "విశాల్ నార్కొలెప్సీ ఉన్న వ్యక్తిగా నటించాడు. నార్కొలెప్సీ కారణంగా అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని విశాల్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమాలోని ప్రధానాంశం. 'పల్నాడు' చిత్రంలో విశాల్ సరసన నటించిన లక్ష్మీమీనన్ ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది., వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హాట్‌గా ఉంటుంది. కథానుగుణంగానే ఆ సన్నివేశాలను తెరకెక్కించాం'' అని దర్శకుడు తిరు చెప్పారు. విశాల్ మాట్లాడుతూ "కొత్తదనం ఉన్న కథతో పాటు మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా శత్రువుల ఆచూకి తెలుసుకుని విశాల్ ఒక్కొక్కరినీ టార్గెట్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలూ పొందింది. కులుమనాలి, జోధ్‌పూర్, చెన్నైలో షూటింగ్ చేశాం. రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించాం. ఈ నెల 20న విడుదల చేస్తున్నాం'' అని అన్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థతో కలిసి విశాల్ ఈ సినిమాను నిర్మించారు. ఇనియా, శరణ్య ప్రధాన పాత్రధారులు. జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. రిచర్డ్ ఎం.నాథన్ కెమెరాను నిర్వహించారు. అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

Saturday, May 31, 2014

మహేష్ సినిమాకు పవన్ ఫ్రీ పబ్లిసిటీ

సూపర్ స్టార్  కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదలైన ‘ఆగడు' చిత్రం ఫస్ట్‌లుక్ టీజర్ ఒకవైపు క్రేజ్ క్రియేట్ చేస్తూనే మరోవైపు సెటైర్లకు ఆస్కారం ఇస్తోంది. ‘ఆగడు' టీజర్‌లో డైలాగ్స్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్'ని గుర్తుచేస్తున్నాయని టాక్ మొదలైంది. 
ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ అనే పేరుతో, మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గబ్బర్‌సింగ్‌లో పవన్ కళ్యాణ్ కూడా పోలీసు పాత్రలోనే కనిపించారు. అందులో పోలీస్ బెల్టు పై గబ్బర్‌సింగ్ అని సినిమా టైటిల్ కనిపించినట్లుగానే, ఆగడులో కూడా మహేష్ బెల్టు పై చిత్రం పేరు కనిపించింది. పోలీసు పాత్రలో టక్ వేసుకోకుండా పవన్ గబ్బర్ సింగ్‌లో కనిపించాడు. టీజర్‌లోనూ మహేష్ ఒక చోట అలాగే కనిపిస్తాడు. 
ఇక డైలాగుల విషయానికి వస్తే,  సింహం గడ్డం గీసుకోదు అనే పవన్ కళ్యాణ్ పాపులర్  డైలాగ్‌కి మహేష్ ఇందులో కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ‘ప్రతి వోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్' అనే డైలాగ్ ‘ఆగడు' టీజర్‌లో పవర్‌ఫుల్‌గా వినిపిస్తోంది. పవన్ పై సెటైర్‌తో టీజర్ రిలీజ్ చెయ్యటంలో ఉద్దేశ్యం ఏమయి ఉంటుందనే విషయం అర్థం కాకపోయినా, ఆల్‌రెడీ ఈ టాపిక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటి ఎన్నికల విజయం తర్వాత పవన్ పేరు చెబితేనే ఎక్కడలేని పాపులారిటీ వచ్చి పడుతోంది. కానీ ఇండియన్ మోస్ట్ డిజైర్డ్ మ్యాన్ మహేష్‌కు పవన్ పాపులారిటీతో పనేంటి?! ఇది అభిమానులను, ప్రేక్షకులకు అర్థం కాని విషయం. అసలు విడిచి కొసరుకు విలువ పెరిగినట్లు, విడుదలైన ఆగడు టీజర్ కన్నా గబ్బర్‌సింగ్, ఆగడుల కంపారిజన్స్, డిస్కషన్స్ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

Tuesday, May 27, 2014

ఓ మై గాడ్ !!! అంతా సీక్రెట్ !

Oh My God Remake Pawan Kalyan, Pawan Kalyan Venkatesh To Shoot Oh My God Remake, Pawan Kalyan News Oh My God Movie, Venky Pawans OMG to roll from June 2

పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా రాజకీయంగా చాలా బిజీగా మారడంతో ఆయన షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. జూన్ 2 నుంచి ఆయన సినిమా విధులు చేపట్టనున్నారు. జూన్ 2 నుంచి ఆయన ‘ఓ మై గాడ్’ సినిమా పనుల్లో బిజీ కానున్నారు. వెంకటేశ్, పవన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కలియుగ కృష్ణుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం  హైదరాబాద్‌లో  ఒక సెట్‌ వేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత సురేష్‌బాబు పవన్ వెసుకోబోయే కాస్ట్యుమ్స్ గురించి ఒక ఫోటో షూట్ నిర్వహించారని సీక్రెట్ సమాచారం. ఈ షూట్‌ని అత్యంత రహస్యంగా చిత్రీకరించడమే కాకుండా, ఆ కెమెరా చిప్స్‌ను వెంటనే సురేష్ బాబు ఆఫీసుకు తీసుకువెళ్లారట. ఈ షూట్ నుంచి బెస్ట్ షాట్స్‌ని సురేష్, వెంకటేశ్ బాబులు సెలెక్ట్ చేసి పవన్‌కి పంపిస్తారట. అన్నీ సజావుగా సాగితే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మరో రెండునెలల తర్వాత బయటకు రావచ్చు.